Hyderabad : అక్రమార్కులపై GHMC ఉక్కుపాదం.. పలు భవనాల కూల్చివేత

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) నగరంలోని మెహిదీపట్నంలో అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Hyderabad : అక్రమార్కులపై GHMC ఉక్కుపాదం.. పలు భవనాల కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని మెహిదీపట్నంలో అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు(Demolitions). ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా భవనాలు, అక్రమ పార్కింగ్, అనుమతికి మించి అంతస్తులు నిర్మించిన వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) అధికారులు పలువురు భవన యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇక జీహెచ్ఎంసీ అధికారులు డైరెక్టుగా రంగంలోకి దిగారు. అనుమతి లేకుండా నిర్మించిన పలు భవనాలు, నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆక్రమార్కులపై ఇకనుంచి కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు జారీ చేశారు అధికారులు.

Next Story