అల్వీన్ కాల‌నీలో జీహెచ్ఎంసీ కూల్చివేత‌లు

by Ratna Kumari |

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి వెడల్పులో

అల్వీన్ కాల‌నీలో జీహెచ్ఎంసీ కూల్చివేత‌లు
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న షాపులను, ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కనీసం తమకు ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి కూల్చి వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. కనీసం తమకు జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు కూడా రాలేదని ఆరోపించారు. అభివృద్ధి పనులకు తాము ఆటంకం కలిగించమని కనీసం సమయం ఇవ్వకుండా కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తులసి వనం నుండి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొందరి లబ్ధి కోసం వాటిని మార్చేసి పేదల ఇండ్లను కూల్చుకుంటూ వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అంటేనే ఎమ్మెల్యే గాంధీకి నచ్చదని ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిలానే వ్యవహరిస్తారని అన్నారు. రేపు జరగబోయే ఓట్లలో ఏ ముఖం పెట్టుకొని తాము ఓటు వేయమని అడుగుతారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ తో మాట్లాడి ఇల్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కూడా ఇచ్చేలా కృషి చేయలేదని స్థానికులు విమర్శించారు.

Next Story