పూజల పేరుతో గంజాయి మాయ.. ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరారీలో

by Bhanu |

ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి, దేవుడి పటాల వెనుక దాచి పూజలు చేస్తున్నట్లుగా నాటకమాడిన ఇద్దరు గంజాయి విక్రయదారులు ఎట్టకేలకు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కారు.

పూజల పేరుతో గంజాయి మాయ.. ఇద్దరు అరెస్ట్,  ముగ్గురు పరారీలో
X

దిశ, కార్వాన్ : ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి, దేవుడి పటాల వెనుక దాచి పూజలు చేస్తున్నట్లుగా నాటకమాడిన ఇద్దరు గంజాయి విక్రయదారులు ఎట్టకేలకు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ టీం లీడర్ అంజి రెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం..ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్‌టీఎఫ్ ఏ బృందం, ఎక్సైజ్ పోలీసులు జియాగూడ కమెలి వద్ద గస్తీ నిర్వహించారు.

ఈ క్రమంలో ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన రోహన్ సింగ్, యశ్వంత్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. దీంతో దేవుడి పటాల వెనుక గంజాయిని దాచి ఉంచిన దృశ్యం బయటపడింది. నిందితుల వద్ద నుంచి 10.934 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసులో స్వప్న మండలం, రాజీవీర్ బారిక్, రోహిత్ అనే ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story