- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad : జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన.. బీజేపీ నేతల పరామర్శ
హైదరాబాద్(Hyderabad) లోని పాతబస్తీలో ఓ జర్మనీ యువతిపై సోమవారం రాత్రి గ్యాంగ్ రేప్(Gang Rape) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని పాతబస్తీలో ఓ జర్మనీ యువతిపై సోమవారం రాత్రి గ్యాంగ్ రేప్(Gang Rape) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సదరు యువతిని మంగళవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి(BJWM Cheif Shilpareddy) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నాగర్ కర్నూల్ ఘటన(Nagar Karnul Incident), నిన్న పాతబస్తీ దారుణ ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గంటకు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ మీర్‌పేటలో విదేశీ యువతిపై అత్యాచారానికి యత్నించిన ఒక వర్గం యువకులపై ఆధారాలు ఉన్నప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి దారుణ ఘటనల్లో కూడా ఓట్ల గురించి ఆలోచిస్తూ ఉండటం సిగ్గుచేటు అన్నారు. వెంటనే ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






