గంగలో కలిసిపోయిన గణపయ్య

by Bhoopathi Nagaiah |

తొమ్మిది రాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య శనివారం గంగమ్మ ఒడికి చేరాడు.

గంగలో కలిసిపోయిన గణపయ్య
X

దిశ, వెబ్‌డెస్క్ : తొమ్మిది రాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య శనివారం గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల డీజే చప్పులు, మహిళల కోళాహాలం నడుమ నగర వీధులగుండా ఊరేగింపుగా తరలి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. హైదరాబాద్‌, ఓల్డ్ మలక్ పేటలోని శ్రీరామ అపార్ట్‌మెంట్ వాసులు గణేష్ విసర్జన్ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. అపార్ట్‌మెంట్ అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో శ్రీరామ సేన నవ రాత్రుల పూజలు ఘనంగా నిర్వహించి, నేడు శోభయాత్రగా వెళ్లి నిమజ్జనం చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్‌పై ఆపరేషన్ సిందూర్, బ్రాహ్మోస్, ఎస్-400 గణేషులు భక్తులను ఆకట్టుకున్నాయి.

Next Story