స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు.. కారణం ఇదే!

by Naveena |
స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు.. కారణం ఇదే!
X

దిశ, శేరిలింగంపల్లి : హెచ్ సీయూ ( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ) వివాదంలో పోలీసుల దూకుడు కొనసాగుతూనే ఉంది. ఏఐ ( ఆర్తీఫీషియల్ ఇంటలీజెన్స్ ) ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని ఇప్పటికే బీఆర్ ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్ కు నోటీసులు జారీచేసి విచారణ సాగిస్తున్న గచ్చిబౌలి పోలీసులు తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఈసారి ఏకంగా తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెచ్ సీయూకు సంబంధించిన వివాదంలో ఏఐ గిబ్లీ ఇమేజ్ ట్విట్టర్ లో రీపోస్ట్ చేసారని స్మితా సబర్వాల్ కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 179 బీఎన్ఎస్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. హెచ్ సీయూకు సంబంధించి గత నెల 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ పోస్ట్ ను స్మితా సభర్వాల్ రీ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో మష్రూమ్ రాక్ దగ్గర బుల్డోజర్ లు కనిపించాయి. వాటిని జింకలు, నెమళ్ళు చూస్తున్నట్లు స్మితా సభర్వాల్ రీ పోస్ట్ చేసిన గిబ్లీ ఇమేజ్ ఉంటుంది.

Next Story

Most Viewed