- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఈనెల 18 నుంచి దేవాదాయ శాఖ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ధర్మవాణి
ఈనెల 18 నుంచి దేవాదాయ శాఖ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ధర్మవాణి
by Ratna Kumari |
దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రతి సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు సికింద్రాబాద్ డివిజన్ ఇన్ చార్జి అసిస్టెంట్ కమిషనర్ ఏ సులోచన తెలిపారు.

X
దిశ, హైదరాబాద్ బ్యూరో : దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రతి సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు సికింద్రాబాద్ డివిజన్ ఇన్ చార్జి అసిస్టెంట్ కమిషనర్ ఏ సులోచన తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాలతో సికింద్రాబాద్ లోని దేవాదాయశాఖ డివిజన్ కార్యాలయంలో ధర్మవాణి నిర్వహించి అర్చక, ఉద్యోగుల సమస్యలకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండి పరిష్కారానికి నోచుకోనటువంటి సమస్యల గురించి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగులు అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వినతి పత్రాలు సమర్పించి సత్వర పరిష్కారం చేయించుకోవాలని సులోచన అర్చక ఉద్యోగులకు సూచించారు.
Next Story






