Breaking News: రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ

by Web Desk |
Breaking News: రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: రెండు ఆర్టీసీ బ‌స్సులు ఒక్కదానిని ఒక‌టి వెనుక వైపు నుండి ఢీ కొన‌డంతో ప్రయాణీకులకు స్వల్ప గాయాలైన సంఘ‌ట‌న వ‌న‌స్థలిపురం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. బీఎన్ రెడ్డి నగర్ నాగార్జున‌ సాగ‌ర్ ర‌హ‌దారిపై సాగ‌ర్ కాంప్లెక్స్ సిగ్నల్ వ‌ద్ద అతివేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా స‌డ‌న్ బ్రేక్ వేయ‌డంతో కారు వెన‌కాల ఉన్న రెండు ఆర్టీసీ బ‌స్సులు ఒక‌దానిని ఒక‌టి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 4 కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో భారీగా సాగ‌ర్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలిసిన వెంట‌నే స్పాట్‌కి చేరుకున్న వ‌న‌స్థలిపురం ఇన్‌స్పెక్టర్ స‌త్యనారాయ‌ణ, పోలీసు సిబ్బంది గాయ‌ప‌డ్డ ప్రయాణికుల‌ను స్థానిక ఆస్పత్రికి త‌ర‌లించి ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. అతివేగంగా వెళ్తున్న కారు రెడ్ సిగ్నల్ ప‌డ‌టంతో డ్రైవ‌ర్ స‌డ‌న్ బ్రేక్ వేశాడ‌ని, దాని మూలంగానే వెనుక ఉన్న వాహ‌నాలు ఒక‌దానిని ఒక‌టి ఢీ కొన‌డంతో ఈ ప్రమాదం జరిగిందని సీఐ స‌త్యనారాయ‌ణ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed