- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్..
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సాగుతున్న అంతర్రాష్ట్ర అక్రమ గంజాయి రవాణా ముఠాను చార్మినార్ టాస్క్‌ఫోర్స్,

దిశ, కార్వాన్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సాగుతున్న అంతర్రాష్ట్ర అక్రమ గంజాయి రవాణా ముఠాను చార్మినార్ టాస్క్‌ఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకునీ, వారి వద్ద 12 లక్షల విలువైన 23 కిలోల పొడి గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, రూ. 7,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం నాంపల్లి హజ్ హౌస్ సమీపంలో పోలీసులు సంయుక్తంగా దాడి చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 12 లక్షల విలువైన 23 కిలోల పొడి గంజాయి, 2 మొబైల్ ఫోన్లు,రూ. 7,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర పర్భని టౌన్‌కు చెందిన అమిత్ అచ్యుత్రావ్ కాలే (33), అతని భార్య సీమా నితిన్ పోత్భారే (33), ఆర్తి మారుతి ఖండారే (27)లతో పాటు సిజేఎల్ ఉండగా, ఏపీకి చెందిన ప్రధాన సరఫరాదారు గోవింద్ (అరకు), మహారాష్ట్రకు చెందిన రిసీవర్లు అఫ్తాబ్ అఫ్జల్ ఖాన్, మీరా భాయ్, ఆమ్రపాలి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా స్మగ్లర్లు గత ఆరు నెలలుగా ఈ అక్రమ రవాణాకు అలవాటు పడినట్లు నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలోని అరకు ఏజెన్సీలో గోవింద్ అనే వ్యక్తి వద్ద కిలో రూ. 6,000 చొప్పున గంజాయి కొనుగోలు చేసి, బుధవారం విశాఖపట్నంలో రైలు ఎక్కి, గురువారం ఉదయం సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ నుండి నాంపల్లి హాజ్ హౌస్ వద్దకు చేరుకుని, మహారాష్ట్ర వెళ్లే ప్రైవేటు బస్సు కోసం వేచి చూస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస రావు పర్యవేక్షణలో, చార్మినార్ జోన్ ఇన్స్పెక్టర్ ఎస్. సైదా బాబు, సబ్ ఇన్స్పెక్టర్లు ఎమ్. మధు, కె. రామారావు, ఎమ్. మహేష్ అబిడ్స్ పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.






