Himayat Sagar : జలాశయం నాలుగు గేట్లు బంద్.. రెండు గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీరు విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2023-07-24 06:59:26  IST  )

మహా నగరవాసుల దాహార్తి తీరుస్తున్న జంట జలాశయాలకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది.

Himayat Sagar  :  జలాశయం నాలుగు గేట్లు బంద్.. రెండు గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీరు విడుదల
X

దిశ సిటీ బ్యూరో: మహా నగరవాసుల దాహార్తి తీరుస్తున్న జంట జలాశయాలకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది. హిమాయత్ సాగర్ జలాశయానికి చెందినఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు.. రెండు రోజులుగా వర్షం పడకపోవడం.. పై నుంచి ఎటువంటి నీరు రాక పోతుండటంతో నాలుగు గేట్లు మూసివేసి రెండు గేట్ల ద్వారా 1340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ నగర్ ప్రస్తుత నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Next Story