- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్డీఎస్ఏను బూచీగా చూపొద్దు: మాజీ ఎంపీ వినోద్‌కుమార్
రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనివార్యమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని సీఎం, మంత్రులు ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. దురదృష్టశావత్తూ సీఎం ద్వేషం పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. ..

BRS boinpally vinod kumar
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనివార్యమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని సీఎం, మంత్రులు ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. దురదృష్టశావత్తూ సీఎం ద్వేషం పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నియంత్రించే సంస్థకాదని.. సలహాలు ఇచ్చే సంస్థ అని చెప్పారు. 16 నెలల క్రితం ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని.. దాంట్లో యాజమాని రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై ఎన్డీఎస్ఏ రిపోర్టును తయారు చేశాయని ఆరోపించారు. కేవలం ద్వేష పూరిత రాజకీయాల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్టును సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం, మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ వ్యవహారంపై కేంద్రంతో మాట్లాడుతారని అనుకున్నామని.. కానీ.. అలా జరగలేదన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు పాముకు ముంగీసకు ఉన్న పగ ఉన్నా.. పోలవరంపై విమర్శలు చేసుకోలేదన్నారు. రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కూలిపోయిందని ఎన్ని రోజులు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏను బూచీగా చూపడం మాని మేడిగడ్డ కన్నెపల్లి నుంచి ఎప్పుడు నీళ్లు ఉంటే అప్పుడు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.






