- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం : బత్తిని గౌడ్స్
జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

దిశ, హిమాయత్ నగర్ : జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ..మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గం లకు ప్రవేశిస్తుందని, ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని, అందుకోసం ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు.
జీహెచ్ఎంసీ. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖతో పాటు మత్య్సశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిర కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని పేర్కొన్నారు.
నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






