- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ కిచెన్ నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. బిల్డింగ్ ఐదో అంతస్తులో రెస్టారెంట్ ఉంది. భవనం నాలుగో అంతస్తులో GRT జ్యువెలర్స్ ఉంది. అయిదవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు వెలువడంంతో బిల్డిండ్‌లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైర్, పోలీసులు సిబ్బంది చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి భవనం లోపల ఉన్న వారిని బయటకు పంపించి వేసి. మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






