Breaking: బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం.. కళ్లద్దాల దుకాణంలో చెలరేగిన మంటలు

by Ramesh Naini |

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద ఉన్న ఓ కళ్లద్దాల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Breaking: బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం.. కళ్లద్దాల దుకాణంలో చెలరేగిన మంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద ఉన్న ఓ కళ్లద్దాల దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పొగలు దట్టంగా అలుముకోవడంతో కాసేపు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Next Story