- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ లో అగ్ని ప్రమాదం
హిమాయత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ భవనంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించింది.

దిశ, హిమాయత్ నగర్ : హిమాయత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ భవనంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఛాంబర్స్ లోని ఫర్నిచర్, సంబంధిత ఫైల్స్, తదితర సామాగ్రి షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమయ్యాయి. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ రాష్ట్ర చైర్మన్ వెన్ రెడ్డి రాజు భవనాన్ని సందర్శించి జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చైర్మన్లు సొంతం నిధులతో నిర్మించుకున్న భవనం పురపాలికలో విప్లమాత్మక మార్పునకు వేదిక అయిందన్నారు.
సమర్థవంతమైన పాలన అవగాహన చైర్ పర్సన్ల సమస్యలు మెరుగైన పురపాలికకు సంబంధించి అనేక అంశాలకు దిక్సూచిగా నిలవడమే కాకుండా పూర్తిస్థాయిలో పురపాలక సంఘాలు పటిష్టవంతం చేయడంలో పలు సమస్యలను పరిష్కరించడంలో కూడా సమర్థంగా పనిచేసిందని వివరించారు. ఎంతో చారిత్రత్మకమైనటువంటి ఈ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం సంభవించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఈ భవనానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్, ఆర్ అండ్ బీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటి రూపాయలను మంజూరు చేసి పూర్తిస్థాయిలో ఆధునికరించాలని ఆయన కోరారు.






