మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం

by Bhanu |

పాతబస్తీ మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండవ అంతస్థు లో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.

మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం
X

దిశ, చార్మినార్ : పాతబస్తీ మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండవ అంతస్థు లో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మొఘల్ పుర ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విషయాన్ని గమనించిన స్థానికులు మొఘల్ పుర పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న మొఘల్ పుర పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే టౌన్ ప్లానింగ్ సెక్షన్ లోని రికార్డు సెక్షన్ లో ఉన్న ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే 2023 సంవత్సరం లోను, 2024 జనవరి నెలలోను అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇక్కడ మూడవ సారి అగ్ని ప్రమాదం జరుగడం పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. అ ప్రాంతంలో సిసి కెమెరాలు కూడా లేకపోవడంతో, సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని రెండు నెలల క్రితం మొఘల్ పుర పోలీసులు నోటీసులు సైతం జారీ చేసిన సిసి కెమెరాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story