Fire Accident : హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లోని ఇటీవల జరిగిన గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద(Gulzar House Fire Accident) ఘటన మరవకముందే.. నేడు మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Fire Accident : హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లోని ఇటీవల జరిగిన గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద(Gulzar House Fire Accident) ఘటన మరవకముందే.. నేడు మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధురానగర్‌(Madhuranagar)లో ఐదంతస్తుల రెసిడెన్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. సెకండ్ ఫ్లోర్‌లోగల ఏసీ కంప్రెషర్ పేలడం(AC Compressor Explotion)తో మంటలు అంటుకున్నట్టు సమాచారం. ఈ పేలుడు వల్ల మంటలు ఎగసిపడి భవనంలోని మిగిలిన అంతస్థులకు మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చారు.

అగ్నిప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ఎవరికైనా గాయాలు అయ్యాయా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదం నగరంలో రెసిడెన్షియల్ భవనాల్లో అగ్నిప్రమాద భద్రతా చర్యల పట్ల మరింత అవగాహన కల్పించే అవసరాన్ని సూచిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Next Story