జైపూర్ స్పెష‌ల్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం

by Ratna Kumari |

నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ లో శుక్ర‌వారం సాయంత్రం జైపూర్ వెళ్లే స్పెష‌ల్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది.

జైపూర్ స్పెష‌ల్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం
X

దిశ‌, కార్వాన్ : నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ లో శుక్ర‌వారం సాయంత్రం జైపూర్ వెళ్లే స్పెష‌ల్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. స్టేష‌న్ లో ఆగిఉన్న హైద‌రాబాద్-జైపూర్ స్పెష‌ల్ ట్రైన్ బోగీల్లో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ప్ర‌యాణికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఈ విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన మూడు ఫైర్ ఇంజ‌న్ల స‌హాయంతో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు బోగీలో ఎవ్వ‌రు లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో హైద‌రాబాద్ నుంచి జైపూర్ వెళ్లేందుకు ప్లాట్ ఫామ్ పై వేచి ఉంద‌ని అధికారులు తెలిపారు.

Next Story