- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫర్నిచర్ షోరూంలో అగ్ని ప్రమాదం
by Ratna Kumari |
హైదరాబాద్ నగరంలోని అసిఫ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎం.జే. ఫర్నిచర్ షోరూంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది.

X
దిశ, కార్వాన్ : హైదరాబాద్ నగరంలోని అసిఫ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎం.జే. ఫర్నిచర్ షోరూంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదం ధాటికి షోరూంలో నిలువ ఉంచిన స్టాక్ అంతా అగ్నికి ఆహుతి అయింది. అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో ఈ షోరూం ఉండటం.. సందులు చాలా ఇరుకుగా ఉండటం వల్ల ఫైర్ ఇంజిన్లు మంటల వద్దకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.
Next Story






