పార్క్ హయత్‌లో ఫైర్ యాక్సిడెంట్.. హోటల్‌ను ఖాళీ చేసిన SRH టీమ్

by Kema Shiva Kumar |

నగరంలోని బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డు నెంబర్-2 పరిధిలో ఉన్న పార్క్ హయత్ (Park Hyatt) హోటల్ మొదటి అంతస్తులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పార్క్ హయత్‌లో ఫైర్ యాక్సిడెంట్.. హోటల్‌ను ఖాళీ చేసిన SRH టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్/ఖైరతాబాద్: నగరంలోని బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డు నెంబర్-2 పరిధిలో ఉన్న పార్క్ హయత్ (Park Hyatt) హోటల్ మొదటి అంతస్తులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. భారీగా ఎగసిపడుతోన్న మంటలతో దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో వేగంగా వ్యాపించాయి. స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం నగరంలో ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా పార్క్ హయత్ (Park Hyatt) హోటల్‌లోని 6వ అంతస్తులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్లేయర్లతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ అక్కడే బస చేస్తున్నారు. ఇవాళ ఉన్నట్టుండి ఫస్ట్ ఫ్లోర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆటగాళ్లు హుటాహుటిన ఆ హోటల్‌ను ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story