- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Fire Accident: నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎగిసిపడుతోన్న మంటలు
Fire Accident: నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎగిసిపడుతోన్న మంటలు
భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) సంభవించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని మాదాపూర్ (Madhapur)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) సంభవించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ భవనంలోని 5వ అంతస్తులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి వేళ అక్కడ ఎవరూ లేకపోవడంతో అర్ధరాత్రి నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల బిల్డింగ్‌లకు కూడా ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






