HYD: అక్రమంగా న‌ల్లా క‌నెక్ష‌న్స్.. తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు

by Ramesh Naini |

జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు.

HYD: అక్రమంగా న‌ల్లా క‌నెక్ష‌న్స్.. తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై తాజాగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 4 (రెడ్ హిల్స్), రెడ్ హిల్స్ లో-లెవెల్ సెక్షన్ పరిధిలో సీతారాం బాగ్ ప్రాంతంలో ఇటీవల జీహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా భావించి.. కాలనీలో తొమ్మిది మంది ఇంటికో అధికార కనెక్షన్ ఉండగా.. అధికారుల అనుమ‌తులు లేకుండా వారే స్వంతంగా మొత్తం 15 అక్రమ న‌ల్లా కనెక్ష‌న్ తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగం ఎండీ సూచనలతో అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్‌ను తొల‌గించ‌డంతో పాటు అక్ర‌మ‌ క‌నెక్ష‌న్ తీసుకున్న తొమ్మిది మందిపై కేసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైప్ లైన్ కనెక్షన్లు తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Next Story