- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతికి ఎండ్ కార్డ్.. మీ వాట్సప్‌కే ఎఫ్ఐఆర్ కాపీ
ఎఫ్ఐఆర్ కోసం బాధితులు పోలీసు స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టే కష్టాలకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ చెక్ పెట్టింది.

దిశ, సిటీ క్రైం: ఎఫ్ఐఆర్ కోసం బాధితులు పోలీసు స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టే కష్టాలకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ చెక్ పెట్టింది. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేందుకు అవినీతికి పాల్పడే సిబ్బంది చర్యలకు పుల్‌స్టాప్ పడింది. నేరుగా బాధితుడి ఫోన్‌కు వాట్సాప్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీ చేరేలా సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. బాధితుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం ఎఫ్ఐఆర్‌లను రిజిస్టర్ చేయగానే దానిని వాట్సాప్‌లో బాధితుడికి పంపించనున్నారు. దీంతో బాధితుడు పోలీసు స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టే తిప్పలు తప్పనున్నాయి. కొత్త విధానం వల్ల బాధితులకు పోలీసు సిబ్బందిపై గౌరవం, సేవలపై నమ్మకం ఏర్పడుతుందని సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు 50 వరకు ఎఫ్ఐఆర్ కాపీలు జారీ చేశారు. ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్‌లకు వారి ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్‌లను సైబరాబాద్ పరిధిలో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజా సేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






