- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీల్డ్ అసిస్టెంట్ లను ఫిక్స్ డ్ టర్మ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో గత 20 ఏళ్ళు గా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను ఫిక్స్ డ్ టర్మ్ (ఎఫ్టీఈ) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

దిశ, హిమాయత్ నగర్ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో గత 20 ఏళ్ళు గా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను ఫిక్స్ డ్ టర్మ్ (ఎఫ్టీఈ) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయంలో బుధవారం ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్ ల నేతృత్వంలో తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్గురి రవి, ప్రధాన కార్యదర్శులు కంకల సిద్దిరాజు, చల్ల వెంకటేశ్వర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పంచాయత్ రాజ్ కమీషనర్ దివ్య కు వినతి పత్రం అందజేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ లను ఫిక్స్ డ్ టర్మ్ (ఎఫ్టీఈ) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిఉద్యోగ భద్రత కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో ఇచ్చిన హామీతో పాటు మంత్రి సీతక్క యూనియన్ ప్రతినిధులతో గత జులై నెలలో జరిగిన చర్చల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఏ.ఫై.ఓ, ఈసీ, టి.ఏ.సి.ఓ ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఎఫ్టీఈలుగా గుర్తించి కనీస వేతనం రూ. 25,000 ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గత 20 ఏళ్ళ నుండి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తక్షణమే స్పందించి మానవతా దృక్పథంతో పరిష్కరించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.






