- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమానుషం.. కొడుకును చంపేసి మూట కట్టి మూసీలో పడేసిన తండ్రి
అనారోగ్యంతో ఉన్న కొడుకుకు వైద్యం చేయించాల్సిన తండ్రే అతని పాలిట కాలయముడయ్యాడు.

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో ఉన్న కొడుకుకు వైద్యం చేయించాల్సిన తండ్రే అతని పాలిట కాలయముడయ్యాడు. కన్నపాశాన్ని మరచి దారుణంగా చంపి.. మూటగట్టి మూసీ నదిలో పడేశాడు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ - బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి తన భార్య సనాబేగం, ఇద్దరు కొడుకులతో బండ్లగూడలోని నూరి నగర్లో నివాసం ఉంటున్నాడు. చిన్నకొడుకు అనాస్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. కొంతకాలంగా నీలోఫర్ లో వైద్యం చేయిస్తున్నారు. భార్యభర్తల మధ్య తరచూ కొడుకు అనారోగ్యం గురించి గొడవలు జరుగుతుండేవి. పండ్ల వ్యాపారం చేస్తున్న అక్బర్ సెప్టెంబర్ 12న బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అదేరోజు రాత్రి భార్య నైట్ డ్యూటీకి వెళ్లగా.. అక్బర్ తన కొడుకుని దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఒక సంచిలో మృతదేహాన్ని కుక్కి.. బైక్ పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి పైనుంచి మూసీనదిలో విసిరేశాడు. శనివారం ఉదయం ఇంటికొచ్చిన భార్య చిన్నకొడుకు కనిపించకపోవడంతో కంగారుపడింది. చుట్టుపక్కల ఉన్న బంధువులకు విషయం తెలియగా పిల్లాడి ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా జాడ తెలియకపోవడంతో అక్బర్ పై అనుమానంతో నిలదీశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. తమదైన శైలిలో అక్బర్ ను విచారించారు. కొడుకును చంపి మూసీనదిలో విసిరేసినట్లు చెప్పడంతో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అక్బర్ ను అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న కొడుకుని వైద్యం చేయించి కాపాడుకోవాల్సింది పోయి ఇంతటి దారుణానికి పాల్పడుతాడా అంటూ.. అక్బర్ ను బంధువులు తిట్టిపోస్తున్నారు.






