Hyderabad : వీవీఐపీ అతిథి గృహం నిర్మాణంపై నిపుణుల క‌మిటీ

by Muthe.Rajitha |

ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీఐలోని వీవీఐపీ అతిథి గృహం నిర్మాణంపై నిపుణుల క‌మిటీ నియ‌మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శికి సీఎంవో(CMO) కీలక సూచ‌న చేసింది.

Hyderabad : వీవీఐపీ అతిథి గృహం నిర్మాణంపై నిపుణుల క‌మిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీఐ(MCRHRDI)లోని వీవీఐపీ అతిథి గృహం నిర్మాణంపై నిపుణుల క‌మిటీ నియ‌మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శికి సీఎంవో(CMO) కీలక సూచ‌న చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల‌తో స‌మావేశాలు, వారి వ‌స‌తి కోసం డాక్టర్ మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ ప్రాంగ‌ణంలో వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం చేయనుంది ప్రభుత్వం. వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణంలో భాగంగా చేప‌డుతున్న ఇత‌ర నిర్మాణాలు, వాటికి చేస్తున్న వ్యయంపై మ‌దింపున‌కు నిర్మాణ రంగ నిపుణుల‌తో క‌మిటీ నియ‌మించాల‌ని సీఎస్ రామ‌కృష్ణారావుకు సూచించిన ముఖ్యమంత్రి కార్యాల‌యం సూచించింది. నిపుణుల క‌మిటీ ఆ నిర్మాణాల‌ను ప‌రిశీలించి త‌మ సిఫార్సుల‌తో నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరింది.

Next Story