MLA Muta Gopal : ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

by Sridhar Babu |

ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.

MLA Muta Gopal : ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి
X

దిశ, ముషీరాబాద్ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అడిక్ మెట్ డివిజన్ లోని ఎస్బిఐ బ్యాంక్ పక్క లేన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి పలువురికి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు

ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చేందుకు విధిగా చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఎంసీ ఖాదర్, ఏ ఎంహెచ్ ఓ మైత్రేయి, డీపీఓ సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు బిల్లా శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, శ్యాంసుందర్ చిట్టి, అస్లాం, నేత శీను, మాధవ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story