సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

by Ratna Kumari |

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేశ్ కుమార్ సూచించారు.

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
X

దిశ, రాంనగర్ : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేశ్ కుమార్ సూచించారు. సైబర్ నేరాలపై రాంనగర్ డివిజన్ లోని ఎస్ఆర్టీ భవనంలో బస్తీ వాసులకు సైబర్ వారియర్, పోలీస్ సిబ్బంది తో కలిసి ఏపీకే ఫైల్స్, మనీ యాప్స్, ఆన్లైన్ వేధింపులు, డిజిటల్ అరెస్ట్, ఓటిపి ప్రాడ్స్ తదితర సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఏ పోలీస్‌ అధికారి నేరుగా వాట్సప్‌ వీడియోకాల్స్‌ చేయరని, డిజిటల్‌ అరెస్టులు అని ఎవరైనా కాల్స్‌ వస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్‌ నేరగాళ్లకు బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారన్నారు. అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణమే 1930లో ఫిర్యాదు చేయాలన్నారు.

Next Story