- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదు : ఆర్.కృష్ణయ్య
బయో డీజిల్ అయిన ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు.

దిశ, హిమాయత్‌నగర్ : బయో డీజిల్ అయిన ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపేష్ సాగర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. గద్వాల జిల్లా రాజోలు మండలం ధన్ వాడ గ్రామం దగ్గర ఉన్న ఇథనాల్ పరిశ్రమపై ప్రజలను రెచ్చ గొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు ప్రజలను రెచ్చ గొట్టి దాడులు చేయించడం సరైంది కాదన్నారు. అడ్డుకుంటున్న నాయకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు.
ఫ్యాక్టరీ వల్ల విష గాలులు వెలువడి, కాలుష్యం అవుతుందని రకరకాల దుష్ప్రచారాలు కల్పించి ఫ్యాక్టరీని అడ్డుకోవద్దని అన్నారు. 99 శాతం పరిశ్రమలు అగ్ర కులస్థులకే ఉన్నాయని, బ్యాంక్ లోన్లు సైతం ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ఇథనాల్ పరిశ్రమ బీసీ వ్యక్తి అయినందుకే అక్కసుతో ఆ ఫ్యాక్టరీపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. కొంత మంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం భవిష్యత్తులో కాలుష్య రహిత బయో డీజిల్, డీజిల్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తూ సబ్సిడీలు కల్పిస్తుందని గుర్తు చేశారు. పండించిన వివిధ ధాన్యాలను కొనుగోలుదారులు లేక నేలపాలు, సముద్రం పాలు చేస్తున్నారని, ఇలాంటి ఫ్యాక్టరీలతో రైతులకు సైతం ఉపాధి కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో సి.రాజేందర్, అనంతయ్య, ర్యాగ రమేష్, తదితరులు పాల్గొన్నారు.






