- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూసఫ్ గూడ, సర్కిల్ 19 పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణలు.. పట్టించుకోని అధికారులు..
యూసఫ్ గూడ, సర్కిల్19 పరిధి, ఎర్రగడ్డ డివిజన్ లో ఎర్రగడ్డ నుండి హైటెక్ సిటీ మాదాపూర్ కి 100 అడుగుల రోడ్డు ప్రక్షాళన అనేది కలగానే మిగిలిపోయింది. చుట్టూ ఆక్రమణలు చాలా ఉన్నాయి.

దిశ, జూబ్లీహిల్స్: యూసఫ్ గూడ, సర్కిల్19 పరిధి, ఎర్రగడ్డ డివిజన్ లో ఎర్రగడ్డ నుండి హైటెక్ సిటీ మాదాపూర్ కి 100 అడుగుల రోడ్డు ప్రక్షాళన అనేది కలగానే మిగిలిపోయింది. చుట్టూ ఆక్రమణలు చాలా ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నారు తప్ప, చర్యలు లేవు, ప్రక్షాళన లేనే లేదు. అయితే ఎర్రగడ్డ లో దారుణంగా పుట్ పాత్ ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు.
కల్పతరువు హైరేజ్ అపార్ట్మెంట్ యాజమాన్యం ఫుట్ పాత్ ను ఆక్రమించి, చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కల్పతరువు హైరేజ్ అపార్ట్మెంట్ విద్యుత్ కోసం ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు చేశారు. వాటికి రక్షణగా ఎలక్ట్రికల్ సముదాయాలను కల్పతరువు అపార్ట్మెంట్ యాజమాన్యం ఫుట్ పాత్ ను ఆక్రమించి గ్రిల్ లు ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కల్పతరువు అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టినప్పటి నుండి కల్పతరువు అపార్ట్మెంట్ ఆనుకుని వున్న రోడ్ మొత్తం వాహనాల పార్కింగ్ తో, రాకపోకలు జరిగేవి కాదు. ఇప్పటికీ రహదారి అదే విధంగా అద్వానంగా ఉంది. అధికారులు మాత్రం చూస్తూ ఉంటున్నారు తప్ప చర్యలు లేవు. రోడ్ మీద వాహనాలు ఎప్పుడు పార్క్ చేసే ఉంటాయి. అసలు విషయం ఏమిటంటే జీహెచ్ఎంసీ అధికారులకు అసలు ఆ రోడ్ ప్రభుత్వనిదా..? లేక కల్పతరువు అపార్ట్మెంట్ దా అనే విషయం తెలియక సందిగ్ధంలో ఉన్నారు. జీహెచ్ఎంసీ డీసీ , టౌన్ ప్లానింగ్ , ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే అధికారుల నుండి సరైన సమాచారం రాలేదు.
అసలే ఇది ప్రధాన రోడ్ పాదచారులు నడిచేందుకు వీలుగా నిర్మించిన ఫుట్ పాత్ లను పూర్తిగా మూసి వేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారి పని తీరుపై స్ధానికులు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు పుట్ ఫాత్ ఆక్రమణతో పాటు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో పాదచారులు నడిచేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి రోడ్డుపై నడక సాగించే పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం లక్షలకు లక్షలు వెచ్చించి ఫుట్ పాత్ నిర్మించినా, ఇవి ఆక్రమణకు గురి కావడంతో పాదచారులకు నిరుపయోగంగా మారాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఫుట్ పాత్ ఆక్రమణ దారులపై తగిన చర్యలు తీసుకోవాలని పాదచారులు, స్ధానికులు కోరుతున్నారు.






