- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరామర్శకు వచ్చి షాక్‌కి గురైన మంత్రి! ఎర్రగడ్డలో విషవిందు
జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఆహార పదార్థాలు తిని ఫుడ్ పాయిజన్ అయిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ తెలిపారు.

దిశ, జూబ్లీహిల్స్ : జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఆహార పదార్థాలు తిని ఫుడ్ పాయిజన్ అయిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 92 మంది పేషెంట్లు ఫుడ్ పాయిజన్ కారణంగానే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి రాజా నరసింహ ప్రత్యక్షంగా వెళ్ళి , అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు, వైద్యాధికారులతో మంత్రి మాట్లాడారు.
ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి దామోదర మాట్లాడారు.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించాలని మంత్రి దామోదర ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. డైయిట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజాన్ జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు. ఆ రోజు ఒక స్వీట్ కూడా అదనంగా రోగులకు ఇచ్చారని వివరించారు మంత్రి దామోదర రాజనర్సింహ.
అనారోగ్యం పాలైన వారిలో తీవ్రంగా ఉన్న 18 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని మంత్రి వివరించారు. మిగతా రోగులని గాంధీ, ఉస్మానియాతో పాటు మొత్తం ఆరు వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని.. వారు మరో రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారని చెప్పారు. ఇక్కడ డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు సైతం సరిగా లేదని సమాచారం అందిందని.. అతని కాంట్రాక్ట్ రద్దు చేశామని తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ.
జరిగిన ఘటనపై ఒక కమిటీని నియమించాయని తెలిపారు. కమిటీ రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు.






