మదీనాగూడ బచ్చుకుంటలో ‘సుందరీకరణ’ ముసుగులో కబ్జాల సంరక్షణ

by Malleboina Mahesh |

మదీనాగూడ బచ్చుకుంటలో అక్రమ కట్టడాలను రక్షిస్తూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం.. గొలుసుకట్టు చెరువుల కబ్జాతో ఏటా మునుగుతున్న నేషనల్ హైవే!

మదీనాగూడ బచ్చుకుంటలో ‘సుందరీకరణ’ ముసుగులో కబ్జాల సంరక్షణ
X

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ జాతీయ రహదారి సమీపంలో సర్వే నెంబర్ 319లో 2.23 ఎకరాల విస్తీర్ణంలో బ చ్చుకుంట ఉంది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా రక్షించే అత్యంత కీలకమైన తటాకం. ఎగువ ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ కాలనీ నుంచి వచ్చే వర్షపు నీరు మల్లయ్య కుంట, ఈర్ల చెరువుకు చేరుతోంది. ప్రస్తుతం బచ్చుకుంట ఎఫ్టీ ఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి ఇల్లు నిర్మించారు. కాలువలు కబ్జాకు గురి కాగా, అలుగులు నామరూపాలు లేకుండా కనుమరుగు ఆయ్యాయి. అప్పటి చందనగర్ సర్కిల్ అధికారులు ఎఫ్‌టీ‌ఎల్ పరిధిలో విచ్చలవిడి గా అనుమతులు మంజూరు చేశారు. చెరువు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరి కొంతమంది షెడ్డు నిర్మించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. చెరువు కబ్జాకు గురైనట్టు శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా చెబుతున్నా బచ్చు కుంట రక్షించే చర్యలు తీసుకోవడం లేదు. ఈ మొత్తం వ్యవహారం పై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సుందరీకరణ పేరుతో దోపిడీ..

బచ్చుకుంట సుందరీకరణ కోసం ఇరిగేషన్ అధికారులు రూ.45 లక్షల నిధులు మంజూరు చేశారు. రివిట్మెంట్ నిర్మాణం, పూడిక తొలగింపు, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ స్థలం కనుమరుగు కాగా.. చెరువు లోపలకు రెండు వేల గజాల పైబడి చొచ్చుకొచ్చి ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. చెరువు విస్తీర్ణాన్ని సంరక్షించి అభివృద్ధి చేయాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణదారులకు కొ మ్ముకాశారు. చెరువు కట్ట నిర్మాణంతో చెరువులో కట్టిన ఇంటి యజమానులకు సహకరిస్తున్నారు. దీంతో చెరువు కుదించుకుపోయింది. కొద్దిపాటి స్థలంలో ట్రాకింగ్ నిర్మాణం పేరుతో భారీగా నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పనులు పర్యవేక్షించాల్సిన ఏఈ గులాం అలీ బదిలీ కావడంతో కాంట్రాక్టర్లు ఆడింది ఆట పాడింది పాటగా తయారు అయ్యింది. ఇక్కడ సుందరీకరణ పేరుతో చెరువుకు ఉరి వేశారు.

ముంపులో ప్రధాన రహదారి..

ఎగువన ఉన్న మల్లయ్య కుంట నిండితే అలుగు పారి బచ్చుకుంట లోకి వరద చేరుతుంది. అక్కడ నుంచి ఈర్ల చె రువుకు చేరే గొలుసు కట్టు చెరువులను చెర పట్టడంతో ప్రతి ఏటా మదీనాగూడ జాతీయ రహదారి ముంపునకు గురవుతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర, మై హోమ్ జువెల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోకి అక్కడ నుంచి దీప్తి శ్రీనగర్ ప్రతీ ఏటా ముంపుకు గురవుతోంది. ఎంతో కీలకమైన గొలుసు క ట్టు చెరువులు రక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, స్థానిక ప్రజాప్రతినిధులు ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నారు. ముంపు నుంచి రక్షించేందుకు నేషన ల్ హైవే అథారిటీ అధికారులు ఈ నీటిని గంగారం చెరువు మళ్లించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర అండర్ గ్రౌండ్ కాలువ నిర్మాణం చేపట్టనున్నారు.

ఇరిగేషన్ శాఖలో వింత పరిస్థితి..

హుస్సేన్ సాగర్ లేక్ డివిజన్ పరిధిలో వందలాది చెరువులో, కుంటలు ఉండగా కబ్జాదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. కబ్జాల చెరువులు కబ్జాల నుండి కాపాడాల్సిన అధికారులు కొరత ఇరిగేషన్ శాఖలో అత్యధికంగా ఉంది. 35 రోజుల నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎ స్ఇ ) మెడికల్ లీవ్‌లో ఉండగా.. తాజాగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లేశం, ఏఈ గులాం అలీ బదిలీపై వెళ్లారు. 9 మంది అధికారులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం డీఈ రాజశేఖర్, ఇద్దరు ఏఈలు రవికుమార్, వీణ కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. సిబ్బంది కొరత కబ్జాదారులకు వరంగా మారింది. చేవెళ్లలో ఎస్సీగా ఉన్న అధికారిని తాజాగా ఇక్కడ అదనపు బాధ్యతలు అప్పగించారు. కోట్ల రూపాయల వ్యయంతో 25 చెరువుల్లో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడితే నాణ్యత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Next Story