- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం.. కఠిన సోషల్ మీడియా రూల్స్ అమల్లోకి
ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) తమ సంస్థలోని విద్యార్థులు, ఉద్యోగుల కోసం సరికొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలను జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని అత్యున్నత వైద్య విద్యాసంస్థ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విద్యార్థులు, ఫ్యాకల్టీ, రెసిడెంట్ డాక్టర్లు, ఉద్యోగుల కోసం కఠినమైన సోషల్ మీడియా మార్గదర్శకాలను (Social Media Guidelines) ఇవాళ విడుదల చేసింది. ఎయిమ్స్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటంతో పాటు, రోగుల గోప్యతకు భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలను తీసుకువచ్చినట్లుగా సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
పేరు, లోగో వాడకంపై నిషేధం..
తాజా మార్గదర్శకాల ప్రకారం ఎయిమ్స్ పరిధిలోని విద్యార్థులు, సిబ్బంది, గుర్తింపు పొందిన అసోసియేషన్లు ఎవరైనా సరే అనుమతి లేకుండా ‘AIIMS, New Delhi’ అనే పేరును కానీ, సంస్థ అధికారిక లోగో, బ్రాండింగ్‌ను కానీ ఉపయోగించకూడదు. ఈ నిబంధన ఈవెంట్ పోస్టర్లు, బ్యానర్లు, సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ వీడియోలు, బ్లాగులు, అఫీషియల్‌లా కనిపించే సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు కూడా వర్తిస్తుందని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు, విద్యార్థులు రోగుల వ్యక్తిగత సమాచారాన్ని, వారి ఫోటోలు, కేసు వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. దీనితో పాటు రాగింగ్, బుల్లీయింగ్, హేట్ స్పీచ్, అశ్లీలత, కోర్టు నిందనలకు సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదనే ఆదేశాలు వెలువడ్డాయి. ఒకవేళ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎయిమ్స్ హెచ్చరించింది.






