- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు.. మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ
భాగ్యశ్రీ బోర్సే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్‌ను వేగంగా విస్తరించుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్: వరుస అవకాశాలతో కెరీర్‌ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్న యువ కథానాయికల్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈమెకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాలు దక్కకపోయినా, తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటోంది. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ, తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న 'సేయాన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే మలయాళ సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కథానాయకుడిగా విష్ణు మోహన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఈమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తక్కువ కాలంలోనే పలు భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇదిలా ఉంటే, శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి 'జార్జ్ రెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.






