- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘ఇండస్ట్రీలో నాతో సమానంగా డ్యాన్స్ చేసేవాళ్లే లేరు’’.. శ్రీలీల వివాదాస్పద వ్యాఖ్యలు
తనతో సమానంగా ఎవరూ డ్యాన్స్ చేయలేరని తాను అన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తన నటన, డ్యాన్సింగ్ స్టెప్స్‌తో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఊహించని క్రేజ్ రాబట్టుకున్నారు. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అమ్మడుకి సరైన హిట్ పడకపోవడంతో సతమతమవుతున్నారు. ఇటీవల ‘పరాశక్తి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించినప్పటికీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ‘D-55’ మూవీలో నటిస్తున్నారు. అదృష్టం కలిసిరానప్పటికీ శ్రీలీలకు అవకాశాల కొరత మాత్రం లేదు. స్టార్స్ సరసన చాన్స్‌లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా శ్రీలీల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతూ.. పెద్ద వివాదంగా మారింది. ఇండస్ట్రీలో తనతో సమానంగా డ్యాన్స్ చేయగల వాళ్లే లేరని శ్రీలీల అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నెటిజన్లు కొందరు శ్రీలీలకు పొగరు, అహంకారం పెరిగిపోయాయంటూ ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు.
ఈ పుకార్లు కాస్తా తన దాకా రావడంతో శ్రీలీల వెంటనే స్పందించి, వీటికి పూర్తిగా చెక్ పెడుతూ అందరికీ అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను శ్రీలీల తీవ్రంగా ఖండించారు. తనతో సమానంగా ఎవరూ డ్యాన్స్ చేయలేరని తాను అన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడలేదని, కొందరు తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని, తనకు గర్వం ఉందంటూ విమర్శలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎప్పుడూ అహంకారం లేదని, తన తల్లిదండ్రులు తనను అలా పెంచలేదని శ్రీలీల చెప్పారు. తోటి నటీనటులను, వారి టాలెంట్‌ను గౌరవించడం తన అలవాటని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి అబద్ధపు పుకార్లు పుట్టించేవారు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తన గురించి బాగా తెలిసిన వాళ్లకు తన నిజ స్వభావం ఏంటో కచ్చితంగా అర్థమవుతుందని శ్రీలీల అన్నారు.






