- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం, సీపీ పేరుతో బంగారం మోసం.. ‘గోల్డ్‌మెన్ సూర్యభాయ్’ అరెస్ట్
తక్కువ ధరకే స్వచ్చమైన విదేశి బంగారం ఇస్తానని అడ్వాన్సులు తీసుకొని మోసం చేసిన కేసులో ‘గోల్డ్‌మెన్ సూర్యభాయ్’ని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులో సోషల్ మీడియా ఫేమస్ పర్సన్ అయిన గోల్డ్‌మెన్ సూర్యభాయ్ (Suryakumar) ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు తాను అత్యంత సన్నిహితుడినని నమ్మించి, విదేశీ బంగారం పేరిట లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడినట్లు బాదితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు అతన్ని గురువారం రాత్రి అరెస్టు చేశారు.
సూర్యకుమార్ కొద్దిరోజులుగా ఒంటి నిండా కేజీల కొద్దీ భారీ బంగారు ఆభరణాలు ధరిస్తూ 'గోల్డ్‌మెన్ సూర్యభాయ్' (Suryakumar)గా సోషల్ మీడియా, టీవీ ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని, తనకు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులతో బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నాడు. తమ వద్ద తక్కువ ధరకే విదేశాల నుంచి తెప్పించిన ఒరిజినల్ బంగారం ఉందంటూ నమ్మించి పలువురి నుంచి లక్షలాది రూపాయల అడ్వాన్సులు వసూలు చేసి, ఆ తర్వాత మొహం చాటేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు.. అతను ధరిస్తున్న భారీ ఆభరణాల విశ్వసనీయతపై అతని వెనుక ఉన్న ఇతర లింకులపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.






