- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్స్‌ను గ్లామర్ డాల్స్‌లా చూడొద్దు.. ఐటమ్ అనడం నటి శ్రమను కించపరడమే అంటూ తమన్నా ఫైర్
సినిమాల్లో వచ్చే స్పెషల్ సాంగ్‌ను ‘ఐటమ్ సాంగ్స్’ అని పిలవడం తనకు అస్సలు నచ్చడం లేదని స్పష్టం చేశారు. అలా పిలవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, క్రేజీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కూడా అమ్మడు ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. రీసెంట్‌గా ఆమె ‘జైలర్-2’ సినిమాలో నటించి మెప్పించారు. అంతేకాకుండా వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. తమన్నా సినిమాలతో పాటు నిత్యం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, తమన్నా ఇండస్ట్రీలో వాడే ఒక పదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన తమన్నా.. సినిమాల్లో వచ్చే స్పెషల్ సాంగ్‌ను ‘ఐటమ్ సాంగ్స్’ అని పిలవడం తనకు అస్సలు నచ్చడం లేదని స్పష్టం చేశారు. అలా పిలవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
‘ఐటమ్’ అనే పదం మహిళలకు ఏమాత్రం మర్యాదకరమైనది కాదని, అది వినడానికి కూడా బాగుండదని తమన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఒక్క ప్రత్యేక పాట కోసం ఒక నటిగా తాము ఎంత కష్టపడుతున్నామో, ఎంత శ్రమ దాగి ఉందో సెట్స్‌లో ఉండే అందరికీ బాగా తెలుసని ఆమె అన్నారు. అంత కష్టపడి చేసిన పాటను కేవలం ఒక ‘ఐటమ్ సాంగ్’ అని పిలిచి వదిలేయడం వల్ల.. ఆ నటి పడిన శ్రమకు, ఆమె టాలెంట్‌కు సరైన గౌరవం ఇచ్చినట్లు అవ్వదని కించపరచడమే అవుతుందని తమన్నా పేర్కొన్నారు. ఇండస్ట్రీలోను, ప్రేక్షకులలోను ఈ ఆలోచనా విధానంలో కచ్చితంగా మార్పు రావాలని ఆమె కోరుకున్నారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌లాగా, అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయకుండా.. వారిలో ఉన్న నటనా ప్రతిభకు కూడా సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని తమన్నా భాటియా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






