‘శ్రీనివాస మంగాపురం’కు రీషూట్ ప్లాన్ చేస్తున్న టీమ్?

by Pulgam srinivas |

'శ్రీనివాస మంగాపురం' మూవీలో కీలక సన్నివేశాలు జోడించేందుకు ఒక్క రోజు రీషూట్ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

‘శ్రీనివాస మంగాపురం’కు రీషూట్ ప్లాన్ చేస్తున్న టీమ్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమాతో ఆయన వెండితెరకు హీరోగా పరిచయం కానున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవీనా టాండన్ కుమార్తె రషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను జూలై 9వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం సినిమా ఫస్ట్ కాపీని వీక్షించినట్లు సమాచారం.

సినిమా మొత్తం అద్భుతంగా వచ్చినప్పటికీ, క్లైమాక్స్‌లో హీరోకు సంబంధించిన మరో ఒకటి లేదా రెండు కీలక సన్నివేశాలు జోడిస్తే సినిమా మరింత ప్రభావవంతంగా ఉంటుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక రోజు రీషూట్ నిర్వహించే అవకాశముందని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మోహన్ బాబు, నరేష్ విజయకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, పి. ఉదయ్ కిరణ్, జెమిని కిరణ్, పి. కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Next Story