విశ్వంభర కోసం నాగ్ అశ్విన్.. సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుందా?

by Pulgam srinivas |

విశ్వంబర చిత్రం కోసం నాగ్ అశ్విన్ VFX పర్యవేక్షణ, గౌర హరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

విశ్వంభర కోసం నాగ్ అశ్విన్.. సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చాలా కాలం క్రితమే 'విశ్వంభర' అనే భారీ బడ్జెట్ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాగే కొత్త విడుదల తేదీని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది.

అయితే మొదట విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలోని గ్రాఫిక్స్‌పై కొంత నెగటివ్ టాక్ రావడంతో, వాటిని మరింత మెరుగుపరచేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 'కల్కి 2898 AD' చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రశంసలు అందుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన VFX పనులను పర్యవేక్షించే అవకాశముందని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం గౌర హరి కూడా పనిచేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా, 'విశ్వంభర' కోసం నాగ్ అశ్విన్, గౌర హరి పని చేయబోతున్నారనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Next Story