- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా
పినపాక నియోజకవర్గంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు డివి గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజె) ఐజే యూ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతని స్తోందన్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఇతర కారణాలతో జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటుందన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, అర్హులైన ప్రతి విలేఖరికి పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా జర్నలిస్టులకు హెల్త్ కార్డుల సౌకర్యాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విలేఖరులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఐ జే యూ జాతీయ కౌన్సిల్ సభ్యులు బివి రమణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జానుమాల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పూజారి చందు తదితరులు పాల్గొన్నారు.






