తల్లీకూతుళ్ల వ్యాపార సామ్రాజ్యం..

by Sujitha Rachapalli |

తల్లీకూతుళ్లు కలిసి ఏం చేయగలరు.. మహా అంటే కలిసి కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటారు.. సాధకబాధకాల గురించి చర్చిస్తారు.. పిల్లలకు పెళ్లిళ్లు అయితే వారి పిల్లలను తల్లి చూసుకుంటుంది..

తల్లీకూతుళ్ల వ్యాపార సామ్రాజ్యం..
X

దిశ, ఫీచర్స్ : తల్లీకూతుళ్లు కలిసి ఏం చేయగలరు.. మహా అంటే కలిసి కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటారు.. సాధకబాధకాల గురించి చర్చిస్తారు.. పిల్లలకు పెళ్లిళ్లు అయితే వారి పిల్లలను తల్లి చూసుకుంటుంది.. ఇప్పటి వరకు చూసినవి ఇవే.. కానీ ఈ తల్లీకూతుళ్లు ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. విదేశాల రుచులను ఇండియాకు పరిచయం చేస్తూ.. ముంబై ఆధారిత ఫుడ్ బ్రాండ్‌ను స్థాపించారు. లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతున్నారు.

విదేశీ రుచులు.. మన వంటింటికి..

ముంబై బేస్డ్ స్టార్టప్ ‘చిల్జో’ .. భారతీయులకు కొత్త రుచులను, ఫ్లేవర్లను అందించాలనే మిషన్‌తో ముందుకొచ్చింది. మొరాకన్ వంటగదుల నుంచి వచ్చిన ఘాటైన హరిస్సా.. చైనా జెస్టీ చిల్లీ ఆయిల్.. షెజ్వాన్ సాస్.. ఇటలీకి చెందిన రుచికరమైన మరినారా.. నోరూరించే అరబ్బియాటా పాస్తా సాస్.. వంటి వాటిని భారతీయుల వంటగదుల్లోకి తీసుకొస్తుంది. 2022లో తల్లి హేమ.. కూతుళ్లు దేవా, ఓజస్వి శర్మ చిల్జోను స్థాపించగా.. ఇది ఇటాలియన్, ఆఫ్రికన్, మెక్సికన్, చైనీస్.. ఇలా నాలుగు వర్గాల్లో ప్రామాణిక సాస్‌లు, కండిమెంట్స్‌ను అందిస్తుంది. నెలకు ఏడు వేల మంది కస్టమర్లకు సేవలు అందిస్తుంది.

ఇదే బిజినెస్ ఐడియా

ఇండియా.. ఇతర దేశాల ఆహారాలు, ఫ్లేవర్లను ఆస్వాదించడాన్ని ఇష్టపడుతుంది. కానీ భారతీయ కంపెనీలు ఆ డిమాండ్‌ను ఫిల్ చేయడంలో వెనుకబడ్డాయి. ఆ ఖాళీని ఫిల్ చేయడమే బిజినెస్ ఐడియాగా మార్చుకున్నారు ఈ తల్లీకూతుళ్లు. డ్రెక్సెల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన దేవా ఫిలడెల్ఫియాలోని ఒక మార్కెటింగ్ సంస్థలో పని చేశారు. మూడేళ్లలో ఆమె వివిధ దేశాలకు వెళ్లి, అక్కడి వంటకాలు రుచి చూసి.. సాంప్రదాయ చెఫ్‌లు, ఫుడ్ ఇండస్ట్రీ నిపుణులను కలిసింది. 2019 మార్చిలో కరోనా లాక్‌డౌన్ వల్ల ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి ఇంటి నుంచే పని చేయడం మొదలుపెట్టింది. పైగా లాక్ డౌన్‌లో పనివాళ్లు లేకపోవడంతో.. తల్లి, సోదరితో కలిసి కొత్త పద్దతుల్లో వంటలు చేయడం ప్రారంభించారు. ఇటలీలో సాంప్రదాయ పద్ధతిలో పాస్తా తయారు చేయడం వంటివి మొదలుపెట్టారు. 24 ఏళ్ల ఓజస్వి (BTech గ్రాడ్యుయేట్) పర్ఫెక్ట్ రెసిపీ తయారు చేయడానికి నాయకత్వం వహించగా.. దేవా రుచి చూసి ఫైనల్ చేసేది. మంచి రెసిపీ కోసం దాదాపు 15 సార్లు ఫెయిల్ అయిన వారు.. యూట్యూబ్, తల్లి సహాయంతో రెసిపీలు తయారు చేశారు. ఇలా ఆఫ్రికా, ఇటలీ, చైనా రుచులను ప్రామాణికంగా రూపొందించడానికి ప్రయత్నించి.. వాటిని తమ కుటుంబీకులు, స్నేహితులు, పొరుగువారికి 200 సాంపుల్స్ పంపిణీ చేశారు. సానుకూల స్పందన వచ్చిన తర్వాత ఇదే బెస్ట్ బిజినెస్ ఐడియా అని గుర్తించి ‘చిల్జో’ను ప్రారంభించారు.

‘చిల్జో’ మెుదలు

2022లో ‘చిల్జో’ అధికారిక యూనిట్‌ ముంబైలో స్టార్ట్ అయింది. కానీ ఫుడ్ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో కష్టాలు ఎదుర్కొన్నారు. మార్జిన్స్, రిటైల్, డిస్ట్రిబ్యూటర్లు, షెల్ఫ్ లైఫ్, జార్లు సీల్ చేయడం వంటి అన్నీ కొత్తగా అనిపించాయి. కానీ మెంటార్ల సహాయంతో ఫుడ్ ఈవెంట్లకు వెళ్లి నేర్చుకున్నారు. వారి ఉత్పత్తులు రూ.129 నుంచి రూ.300 రేంజ్‌లో ఉండగా.. బిగ్‌బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో అవెలబుల్‌లోకి తెచ్చారు. ప్రస్తుతం ఇందులో 30 మంది కార్మికులు పని చేస్తుండటం విశేషం. కాగా నెలకు 7వేల మంది కస్టమర్లకు సేవలందిస్తున్న చిల్జో.. లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతుంది.

నిజాయితీగా..

ఈ తల్లీకూతుళ్లు తమ బిజినెస్‌ను నిజాయితీగా నడిపించడం వల్లే సక్సెస్ కాగలిగారు. ఉదాహరణకు ఇటాలియన్ చెఫ్ టమాటాలను 8 గంటలు వండి, నలిపి, హెర్బ్స్, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో కలిపి గట్టిపరుస్తారు. వీళ్లు కూడా అదే విధంగా చేస్తారు. కానీ ఇండియన్ కంపెనీలు నీళ్లు, చక్కెర కలిపి ఆ ఫ్లేవర్ తీసుకొస్తారు. అందుకే ‘చిల్జో’ డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా అని చెప్తున్నారు. షెజ్వాన్ సాస్.. సిచువాన్ పెప్పర్‌కార్న్స్, ఫామ్ సెలరీ, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో తయారు చేస్తారు. జెనోవా పెస్టోలో పైన్ నట్స్, హ్యాండ్-చాప్డ్ హెర్బ్స్, పార్మెసాన్ చీజ్ ఉపయోగిస్తారు. చాలా పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మరీ వినియోగదారులకు నచ్చిన రుచిని అందించడమే లక్ష్యంగా సాగుతున్నారు.

Next Story