- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాలుగు విమానాల అత్యవసర ల్యాండింగ్.. కారణం ఇదేనా!

దిశ, వెబ్ డెస్క్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(Rajeev Gandhi International Airport)లో శనివారం నాలుగు అతర్జాతీయ విమానాలను అత్యవసర ల్యాండింగ్(Emergency Landing) చేశారు. లండన్(London), మస్కట్(Muscat), సింగపూర్(Singapoor) నుంచి చెన్నై(Chennai) వెళ్లాల్సిన నాలుగు విమానాలు చెన్నైలో వాతావరణం అనుకూలించక పోవడంతో హైదరాబాద్(Hyderabad) లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
*లండన్ నుంచి చెన్నైకి బయల్దేరిన బీఏ 035 నంబర్‌గల విమానం అక్కడ వాతావరణం అనుకులంగా లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.58 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. తిరిగి 10.54 నిమిషాలకు తిరిగి చెన్నైకి వెళ్లిన్నట్లు తెలిపారు.
*మస్కట్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన డబ్ల్యూవై 251 నంబర్‌గల విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.04 నిమిషాలకు ల్యాండింగ్ చేసి.. 11 గంటలకు చెన్నై తిరిగి వెళ్ళింది.
*సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ఎస్‌క్యూ 524 విమానం వాతావరణం అనుకులంగా లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.20 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. తిరిగి 11.08 నిమిషాలకు తిరిగి వెళ్లింది.
*ముంబై నుంచి చెన్నై వచ్చిన ఏఐ 2821 నంబర్‌గల విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.45 నిమిషాలకు ల్యాండింగ్ చేసి తిరిగి 11.24 నిమిషాలకు తిరిగి వెళ్లిన్నట్లు వివరించారు. కాగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు.