హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’ ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్

by Kodari Anjali |

భారతదేశంలో తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’ ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్
X

దిశ, ఖైరతాబాద్: భారతదేశంలో తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేసారి మూడు అవుట్‌లెట్లను హీరోయిన్ రాశి సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశి సింగ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉందని, కొత్త రుచులను ఇష్టపడే నగరవాసులకు ఈ ప్రత్యేక డెజర్ట్స్ తప్పకుండా నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాండ్ వ్యవస్థాపకులురిసియాస్, హాశిమ్, రిషద్ మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం కేరళలో ప్రారంభమైన ‘సైన్ లబాన్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 అవుట్‌లెట్లకు విస్తరించిందని, ఇప్పుడు హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ సిటీ పార్ట్‌నర్స్ గంగా విరాజ్, గంగా ధీరజ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి ఈజిప్షియన్ డెజర్ట్స్‌ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రణాళిక ఉందని తెలిపారు. ప్రారంభోత్సవానికి నగర ప్రముఖులు, ఫుడ్ బ్లాగర్లు, డెజర్ట్ ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ఈజిప్షియన్ డెజర్ట్స్‌ను ఆస్వాదించారు.

Next Story