- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA : హైదరాబాద్ క్రికెట్ అకాడమీకి ఈడీ షాక్
హైదరాబాద్ క్రికెట్ అకాడమీ(HCA)కి ఈడీ(ED) భారీ షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)కి ఈడీ(ED) భారీ షాకిచ్చింది. హెచ్సీఏకు చెందిన రూ.51 లక్షల ఆస్తులను బుధవారం ఈడీ అటాచ్ చేసింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు సమాచారం. హెచ్సీఏలో సురేందర్ విధులు నిర్వహిస్తున్నపుడు క్రికెట్ బాల్స్, ఛైర్స్, వ్యాయామ పరికరాలు కొనుగోలు చేయడానికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని ఈడీ అభియోగాలు మోపింది. 3 కంపెనీలతో ఆయన క్విడ్ ప్రో కో(Quid Pro Co) చేసుకున్నారని, ఆయా కంపెనీలు రూ.90 లక్షలు సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు గుర్తించారు. హెచ్సీఏ సెక్రెటరీ, ట్రెజరర్ లు ఇద్దరూ ఆర్థిక అక్రమాలకు తెరలేపినట్టు దర్యాప్తులో తెలుసుకున్న ఈడీ అధికారులు.. బుధవారం మాజీ ట్రెజరర్ సురేందర్ ఆస్తులు జప్తు చేసింది. కాగా ఈ కేసులో మరింత లోతైన విచారణ జరుపుతున్నామని, మరికొంతమంది కూడా ఈ అక్రమాల్లో బయటికి రావొచ్చునని ఈడీ అధికారులు తెలియజేశారు.






