- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజా విసిరిన ఈగల్..14 మంది మత్తు బాబులు అరెస్టు
ఈగల్ పోలీసులు సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మంగళవారం వెలుగులోకి తీసుకువచ్చారు.

దిశ, సిటీక్రైం : ఈగల్ పోలీసులు సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మంగళవారం వెలుగులోకి తీసుకువచ్చారు. గోవా నుంచి హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుందని గుర్తించారు. ఈగల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..హైదరాబాద్ కు చెందిన చక్రీ, హర్షిద్ రెడ్డి, సుశిల్ క్రిష్ణ లు గోవా వాగాటర్ బీచ్ వద్ద కైట్స్ రూమ్స్ అండ్ హాస్టల్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. గోవాలో ఉంటున్న ఈ ముగ్గురు బెంగళూరుకు చెందిన డ్రగ్స్ వ్యాపారుల నుంచి కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డి బ్లాట్స్ ను, ఒడిశా నుంచి హాష్ ఆయిల్ ను కొనుగోలు చేసి వాటిని మహబూబ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ , సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలలోని మత్తు బాబులకు విక్రయిస్తున్నారు. చక్రీ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మందికి డ్రగ్స్ ను విక్రయిస్తున్నాడని దర్యాప్తులో ఈగల్ అధికారులు పసిగట్టారు. ఈ ముగ్గురి నుంచి డ్రగ్స్ కొంటున్న మొత్తం 44 మందిని ఈగల్ అధికారులు గుర్తించి, సోదాలు జరిపారు. 19 మంది చిక్కడంతో వారికి డ్రగ్స్ కిట్స్ లతో పరీక్షలు నిర్వహించగా 14 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిపై కేసులను నమోదు చేసి డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించారు. అరెస్టైన వారిలో తన్నీరు వెంకటరావు, గంటి భరత్, మురళి క్రిష్ణ సుశీల్, యశ్వంత్ సాయి, కొప్పుల నాగరాజు, కే.వంశీధర్ రెడ్డి, సుగుర్ల అరుణ్ కుమార్, గింజుపల్లి సందీప్, టి.సాత్విక్ రెడ్డి, కే.సందీప్ రెడ్డి, మ్యాకల ప్రవీణ్, చింతమడక అభిలాష్, పడాల క్రాంతి సాగర్, పరిటాల రోహిత్ లు ఉన్నారు. ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1908, వాట్సాప్ నంబర్ 8712671111 కు ఈ ముఠా సమాచారం రావడంతో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య 15 టీంలతో ప్రత్యేక ఆపరేషన్ ను నిర్వహించి మత్తు బాబులను గుర్తించారు. ముఠా సూత్రధారులైన చక్రీ, హర్షిద్ రెడ్డి, సుశీల్ కుమార్ లను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలను ఈగల్ పోలీసులు చేపట్టారు. చక్రీ సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు. అతని నుంచి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారనే కోణంలో ఈగల్ పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ముఠా నుంచి దాదాపు 4 లక్షలు చెల్లించి అరెస్టైన వారు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈగల్ పోలీసులు విచారణలో బయట పడింది.






