హకీంపేట్ భూముల ఈ-వేలం వాయిదా

by Vemula.Srinu Prasad |

షేక్ పేట్ మండలంలోని హకీంపేట్‌లో విలువైన భూముల వేలం ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ-వేలం తేదీల్లో మార్పులు చేసింది.

హకీంపేట్ భూముల ఈ-వేలం వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: షేక్ పేట్ మండలంలోని హకీంపేట్‌లో విలువైన భూముల వేలం ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ-వేలం తేదీల్లో మార్పులు చేసింది. షేక్‌పేట్ మండల పరిధిలోని హకీంపేట్ గ్రామం, సర్వే నంబర్ 102/1, టీఎస్. నంబర్లు 1/పీ, 3/పీ పరిధిలో ఉన్న బంజారాహిల్స్ సమీప భూభాగాన్ని విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఈ-వేలం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ భూమి విస్తీర్ణం 8 ఎకరాలు 24 గుంటలుగా ఉంది. ముందుగా ప్రీ-బిడ్ సమావేశాన్ని జూన్ 12, 2026న, ఈ-వేలాన్ని జూన్ 19, 2026న నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అయితే పరిపాలనా కారణాల వల్ల ఈ కార్యక్రమాల తేదీలను మార్చారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ప్రీ-బిడ్ సమావేశం ఈనెల 19న, ఈ-వేలాన్ని జులై 2వ తేదిన నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనే పెట్టుబడిదారులు, ప్రతినిధులు, ఇతర భాగస్వాములు కొత్త తేదీలను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్ఎండీఏ సూచించింది.

Next Story