Breaking: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం .. ఈ రూట్‌లో ట్రాఫిక్ జామ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-13 08:22:19  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోనూ పలుచోట్ల ఉదయం నుంచి వర్షం పడుతోంది....

Breaking: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం .. ఈ రూట్‌లో ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోనూ పలుచోట్ల ఉదయం నుంచి వర్షం పడుతోంది. కొంతసమయం తెరపిచ్చినప్పటికీ మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. చిన్నపాటి వర్షానికి కూడా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో గచ్చిబౌలి, దర్గా, షేక్ పేట్, టోలీచౌక్, మెహిదీపట్నం రూట్‌లో వాహనాల రద్దీతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షం పడితే ఇటు లింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట రూటులోనూ రోడ్లపై అక్కడక్కడ నీళ్లు నిలచిపోతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోనూ పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ వైపు వర్షం పడుతుండటంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో నాళాల్లోకి తరలిస్తున్నారు. రోడ్లపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ స్తంభాలు ఉన్న వైపు చిన్న పిల్లల్ని పోనివ్వద్దొని చెబుతున్నారు. వర్షాలు ముగిసే వర్షాలు అత్యవసరమైతే తప్ప గ్రేటర్ వాసులు బయటకు రావొద్దని తెలిపారు.

Next Story