ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు

by Ratna Kumari |

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 15, 16 తేదీలలో హైదరాబాద్‌ వ్యాప్తంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ ప్రత్యేక తనిఖీలలో 474 మంది మందుబాబులు పట్టుబడ్డారు . ఈ మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగిందని, పట్టుబడిన వారిలో 417 మంది ద్విచక్రవాహనదారులు, 24 మంది త్రీ వీలర్ , 33 మంది ఫోర్ వీలర్, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 300 అంతకంటే ఎక్కువ బీఏసీ నమోదైన వారిలో 12 మంది ఉన్నట్లుపేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి విషయంలో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు, నగర ప్రజలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

Next Story