హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

by Naveena |
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
X

దిశ, శేరిలింగంపల్లి : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద భారీ ఎత్తున రంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు డ్రగ్స్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు వద్ద నుంచి డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీమ్ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే డీటీఎఫ్ టీం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. డీటీఎఫ్ టీమ్ తో వాగ్వాదానికి దిగినట్లు చెబుతున్నారు.

అయితే అతను ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చాడు. ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్నదానిపై సంబంధిత అధికారుల ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు కావడంతో.. గోప్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. డ్రగ్స్ పట్టుబడిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని గచ్చిబౌలి పోలీసులు, శేరిలింగంపల్లి ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనకు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed