సింగ‌రేణి కాలనీలో తాగునీటి క‌ష్టాలు

by Ratna Kumari |

సింగరేణి కాలనీలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానిక మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు వైశాలి నగర్ మేనేజర్‌కు శనివారం మెమోరండం సమర్పించారు.

సింగ‌రేణి కాలనీలో తాగునీటి క‌ష్టాలు
X

దిశ, చంపాపేట్ : సింగరేణి కాలనీలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానిక మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి వైశాలి నగర్ మేనేజర్‌కు శనివారం మెమోరండం సమర్పించారు. కాలనీలోని గుడిసెల ప్రాంతాలకు సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకర్లు అక్కడి జనాభాకు ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు రోజులకొక‌సారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారని, దీంతో కుటుంబాల అవసరాలకు తగినంత తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తాగునీటి కొరత మరింత తీవ్రమైందని, రోజువారీగా లేదా అవసరానికి అనుగుణంగా అదనపు ట్యాంకర్లను పంపించి ప్రజలకు తగినంత మంచినీరు అందించాలని అధికారులను కోరారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని కాలనీవాసుల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ డివిజన్ కార్యదర్శి షేక్ మహమూద్‌తో పాటు మహిళలు పద్మ, సభా, రత్నమ్మ, చిట్టి, రంజాన్ పాల్గొన్నారు.

Next Story